స్వదేశం అంటే విముఖత పుట్టించే భావజాలం బాగా పెరిగిపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే ముందు వరకు అదే పోకడ కనిపిస్తుంది కొన్ని వ్యవస్థలలో. ఇలాంటి భావజాలం ఉన్న ప్రాంతం నుండి ఒక గొప్ప సంస్థ పుట్టడం కానీ వేరే చోటనుండి ఇక్కడకు వచ్చినా కానీ దానిని కూడా మార్చేయగలిగే సామర్థ్యం ఉంది ఈ వ్యతిరేక భావజాలానికి. ఇలాంటి వారందరికీ స్వదేశం చేదుగాను, విదేశాలు భూతల స్వర్గాలు గాను కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ ప్రతి కదలికలో అదే కనిపిస్తుంది. భారత్ పై ఒకడు గెలిస్తే వాడికి పాలాభిషేకాలు, ఒకరు భారత్ ను తిడితే వాళ్లకు అనుకూలంగా సామజిక మాధ్యమాలలో లైక్ లు కొట్టడం వీళ్ళ ప్రధాన కర్తవ్యంగా మారిపోతుంది. ఇక్కడ ఉండలేకపోతే వేరే చోటకు వెళ్లి బ్రతకవచ్చు కానీ అలా చేయడం వాళ్ళ లక్ష్యం కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉన్న వారిని పాలు నీళ్ల మాదిరి వేరుచేసేయాలి. అనంతరం వాళ్ళందరూ కొట్టుకు చస్తుంటే చూసి ఆనందపడాలి.

భారతదేశంలో కొందరు మేధావులుగా చలామణి అవుతూ మరి ఇలాంటి భావజాలం ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు. వాళ్ళు ఒక సంస్థ భారత్ లోకి వస్తే దానిపై అనేక విమర్శలు లేవనెత్తుతూ అవి అక్కడ నుండి వెళ్లిపోయేదాకా నిద్రపోరు. ఇక ఒక సంస్థ నష్టాల్లో ఉన్నది, దానికి పరిష్కారం ఇది అని చెప్పినా వినకుండా, మూసేసుకోవడం మేలు అనేవిధంగా వీళ్లు కృషి చేస్తారు. దానిని భరించలేని సంస్థలు లాక్ అవుట్ విడిస్తే, దానిలో పని చేస్తున్న కార్మికులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలంటూ వాళ్ళను ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంఘాల సాక్షిగా మరియు ఆయా సంఘాలను నెత్తినపెట్టుకుని ఊరేగుతున్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో వాళ్లకు హక్కులు అని పోరాడతారు, అదే తమ భావజాలం ఉన్న ఇతర దేశాలలో పరిస్థితి పట్ల మాత్రం పెదవి విప్పరు.

చైనా, రష్యా లాంటి దేశాలలో 18గంటలు, 20 గంటలు పని చేస్తున్నప్పటికీ కార్మిక హక్కుల గురించి నోరెత్తడం ఎవరికి చేతకాదు. అలా చేయకపోగా, ఆ దేశాలను అదేదో సాదించేసినట్టుగా గొప్పగా బుజానవేసుకుని పొగడటం మాత్రం చేస్తుంటారు. ఇలాంటి భావజాలానికి బానిసలూ అయిన వాళ్లలో సైంటిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లకు చెందిన వారు కూడా ఉన్నారు. అవన్నీ వాళ్ళు నెత్తిన పెట్టుకోవడమే కాదు, స్వదేశాలియుల నెత్తిన కూడా రుద్దుతూ ఉంటారు. బహుశా వీళ్ళను ఆయా ప్రచారాలకు ఆ దేశాలు వాడుకుంటున్నాయేమో తెలియదు. ఇలాంటి భావజాలం పెట్టుకుని కూడా వీళ్లు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఒక గూగుల్, అమెజాన్, ఆపిల్ లాంటి సంస్థలు దేశంలో ఎందుకు పుట్టావు అంటారు. పుట్టడానికి అవకాశం ఇస్తే కదా ముందు. ఆ అవకాశం వచ్చినప్పుడు దానిని వ్యతిరేక భావజాలంతో చిదిమేస్తున్నారు, ఇక్కడ అలాంటి సంస్థలు తయారైతే వాళ్లకు పుట్టగతులు ఉండవనే భయం కావచ్చుగాక. వీళ్ళందరూ ఆయా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలలో వాళ్ళే, ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక ఇంకా జలగలు మాదిరి ప్రజలను ఎందుకు పీడిస్తున్నారో చెప్పాలి. అలా పీడిస్తున్నంత కాలం ఇక్కడ అభివృద్ధి కుంటుకుంటూనే ఉంటుంది. విద్యార్థి సంఘాల నుండి యాజమాన్య సంఘాల వరకు అన్ని సంఘాలలో వీళ్లే ఉంటారు. కావాల్సిన సమయంలో ఉద్యమాల పేరుతో అభివృద్ధిని చిదిమేస్తారు. అందుకే ఇక్కడ నాణ్యత ఇతర దేశాలలో గొప్పగా గుర్తింపు పొందుతూ ఉంది. ఆ వలస వాదానికి కూడా వీళ్ళ భావజాలమే కారణం. అన్నీ కలిసి దేశాన్ని ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే ఉంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: