ఫేక్ అనే పదం ఇటీవల కాలంలో మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది ఇక ఇలాంటి ఫేక్ ఐడెంటిటీ తోనే ఎన్నో నేరాలకు పాల్పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. డాక్టర్లు కాని వారు ఫేక్ సర్టిఫికెట్ సాధించి ఇక డాక్టర్లుగా చేలామని అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక పోలీస్ విభాగంలో కూడా ఇలా సర్టిఫికెట్లు లేని వారు సైతం ఫేక్ ఐడెంటిటీ సృష్టించుకుని జనాలను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక మరి కొంతమంది అధికారులు కూడా ఇలా ఫేక్ అని తేలిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఫేక్ డాక్టర్లని లేదా ఫేక్ పోలీసులను చూసాం. ఇలాంటి వారికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొట్టాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఏకంగా ఫేక్ ఎమ్మెల్యే గురించి. షాక్ అవుతున్నారు కదా. నిజంగానే ఇక్కడ ఫేక్ ఎమ్మెల్యే ప్రత్యక్షమవడం కాస్త సంచలనంగా మారిపోయింది. పశ్చిమబెంగాల్ లోని అసెంబ్లీలో ఇలా ఫేక్ ఎమ్మెల్యే రావడం కలకలం రేపింది.


 వైట్ షర్ట్ వేసుకొని పైన ఒక కోటు వేసుకొని తాను ఒక సీనియర్ ఎమ్మెల్యే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. ఏమాత్రం భయం బేరుకూ లేకుండా దర్జాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి సీను రివర్స్ అయ్యింది అని చెప్పాలి. అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా అతను దొరికిపోయాడు. ఇక చివరికి అతను ఒక నకిలీ ఎమ్మెల్యే అన్న విషయం బయటపడింది. అప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలోని గేటు దాటి లోపలికి వచ్చాడు. అయితే తర్వాత మెయిన్ బిల్డింగ్ దగ్గర భద్రత సిబ్బంది అడ్డుకొని ప్రశ్నించడంతో అతని బండారం మొత్తం బయటపడిపోయింది అని చెప్పాలి. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అతన్ని పోలీసులు చివరికి అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు.


 అయితే ఒక వైపు అసెంబ్లీలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండగా ఇక ఎమ్మెల్యేలు అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలా ఫేక్ ఎమ్మెల్యే అసెంబ్లీ వద్ద ప్రత్యక్షం కావడంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా తాను ఎమ్మెల్యేను అంటూ చెప్పుకొని అసెంబ్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వ్యక్తి విషయంలో ప్రతిపక్ష బిజెపి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీలో భద్రతపై మమత సర్కార్ అశ్రద్ధ వహిస్తుంది అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది అని చెప్పాలి. ఇక అసలేం జరిగిందో ఆరా తీస్తున్నాం అంటూ అటు అధికారపక్షం సమాధానంచెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: