చాలాకాలానికి నరేంద్రమోడీకి సుప్రింకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తగిలిన షాక్ కూడా మామూలుది కాదు నోట మాట రానంతగా తగిలింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అధికారమని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రజలకు జవాబుదారి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కానీ కేంద్రం నియమించిన లెఫ్ట్ జనరల్ ఎంతమాత్రం కాదని స్పష్టంగా చెప్పేసింది.





ఎల్జీ తన పరిధిలో తానుండాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాంతో మోడీకి దిమ్మతిరిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి కేంద్రానికి కేవలం శాంతిభద్రతలు, భూ వ్యవహారాల్లో మాత్రమే అధికారం ఉంటుందని కూడా తేల్చింది. మిగిలిన అన్నీ విషయాల్లోను, పాలనా వ్యవహారాల్లో ఆప్ ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని కూడా చెప్పింది. ఇక్కడ విషయం ఏమిటంటే చాలాకాలంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎల్జీ సతాయించేస్తున్నారు.





అరవింద్ మీద నరేంద్రమోడీకి విపరీతమైన ధ్వేషం పెరిగిపోయింది. ఆ ధ్వేషాన్ని ఎల్జీని అడ్డం పెట్టుకుని మోడీ తీర్చుకుంటున్నారు. అసెంబ్లీలో చేసిన ప్రతి తీర్మానాన్ని ఎల్జీ రివర్స్ కొడుతున్నారు. తన అనుమతి లేనిదే కేజ్రీవాల్ ఒక్క అడుగు కూడా వేసేందుకు లేదన్నట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఆప్ ప్రభుత్వం కూడా తన చెప్పుచేతుల్లో ఉండాల్సిందే అన్నట్లుగా ఎల్జీ అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు.





దాంతో కేజ్రీవాల్-ఎల్జీ మధ్య యుద్ధం తారస్ధాయికి చేరుకుంది. ఎల్జీని అడ్డంపెట్టుకుని మోడీ కేజ్రీని బాగా సతాయించేస్తున్నారు. దీనిపై కేజ్రీ సుప్రింకోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన సింగిల్ జడ్జి అన్నీ అధికారులు ఎల్జీకే ఉంటాయని చెప్పింది. దానిపైన కేజ్రీ రివ్యూకి వెళ్ళారు. ఈ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎల్జీని ఉతికి ఆరేసింది. కేజ్రీని ఇబ్బందులు పెడుతున్న కేంద్రానికి తన పరిధి ఏమిటో స్పష్టంగా వివరించి చెప్పింది. అంటే ఇకనుండి ఎల్జీకి కేజ్రీని నియంత్రించే ఎలాంటి అధికారులు ఉండవని తేలిపోయింది. నిజంగా ఇది మోడీకి ఊహించని షాకనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: