కొంతమందికి తమ బిడ్డలు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయాలి. లక్షల జీతం తీసుకోవాలి కోటీశ్వరులు కావాలి. కానీ వారు మాత్రం ఆ జాబ్ లు ఇచ్చే బడా కార్పొరేట్ కంపెనీలను విమర్శిస్తారు. దీని వల్ల నష్టపోయేది కార్పొరేట్ కంపెనీలే కాదు అందులో పని చేసే మన బిడ్డలు, కొడుకులు.. ఇలా కొన్ని కార్పొరేట్ వ్యవస్థలపై పక్కా ప్రణాళిక ప్రకారం విష ప్రచారం చేసి ఆయా కంపెనీలు తీవ్రంగా నష్టపోయేలా చేయడమే కొంతమంది పని.


ఇండియా  స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎల్ఐసీని కూడా టార్గెట్ చేస్తున్నారు. దేశంలో ఎల్ఐసీ మొత్తం విలువ ప్రస్తుతం 42 లక్షల కోట్లు. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన మొత్తం 30 వేల కోట్లు. దానిని ఇప్పటికి కూడా లెక్క పెడితే 56 వేల కోట్ల షేర్ విలువ ఉంది. అంటే నష్టాల్లో లేదు. పూర్తిగా లాభాల్లోనే కొనసాగుతుంది. అయినా ఎల్ఐసీ నాశనం అయిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు.


దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందనే విషయాన్ని దేశ ప్రజలు మరిచిపోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నాం చేయడానికి అమెరికాలో కొంతమంది కుట్రదారులు కావాలనే అదానీ, అంబానీ లాంటి కంపెనీలను టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారే వాదన ఉంది. నష్టపోకున్నా పూర్తిగా ఆ కంపెనీలు దివాలా తీసినట్లు షేర్ మార్కెట్లు కుప్పకూలినట్లు చెబుతున్నారని.. మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారంతా గందరగోళానికి గురై షేర్లను వెనక్కి తీసుకోవడం జరుగుతుందని చెబుతున్నారు.


ఇలా దేశ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న కుట్రను దేశ ప్రజలు నిశితంగా గమనిస్తేనే  విదేశీయుల కుట్రల నుంచి బయటపడతామంటున్నారు విశ్లేషకులు. లేదా గతంలో 200 ఏళ్ల పాటు మనలో మనం కొట్టుకు చస్తూ విమర్శలు చేసుకుంటూ పోతే అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకుని మనల్ని దెబ్బతీస్తాయంటున్నారు. వివిధ దేశాల నివేదికల్లో ఏదీ నిజమో, అబద్దమో తెలుసుకుంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC