తమిళనాడులో అన్నామలై భారతీయ పార్టీని ఉత్తేజపరుస్తూ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈయన మాజీ పోలీసు అధికారి. అయితే ఈయనను టార్గెట్ చేస్తూ డీఎంకె పార్టీ విమర్శలు చేస్తోంది. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ అయినా అన్నాడీఎంకె ఇదే విధంగా అన్నామలై పై విమర్శలకు దిగుతోంది. ఏఐడీఎంకె కూడా మద్దతు తెలపడం వెనక ఈ పార్టీని బలహీనం చేసి అక్కడ బీజేపీ బలంగా తయారు అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. కాబట్టి అన్నామలైను అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి.


అన్నామలై పెద్ద అవినీతి  పరుడుని ఆరోపణలు చేస్తున్నారు. అన్నామలై పెట్టుకునే వాచీ రూ.3 లక్షల విలువ చేస్తుందని, అన్నామలై ఖర్చు నెలకు రూ.8లక్షల నుంచి 9 లక్షల వరకు ఖర్చవుతోందని డీఎంకె ఆరోపణలు చేసింది. అన్నామలై దీనికి సమాధానం చెబుతూ పార్టీ ఆఫీసులో పనిచేసే పీఏలకు జీతాలివ్వాలి. పార్టీ ఆఫీసు ఖర్చు భరించాలి. వీటిన్నింటికి దాదాపు రూ.7 నుంచి రూ.8లక్షల ఖర్చవుతుంది. నాకున్న కారు స్నేహితుడు ఇచ్చాడు. దాంట్లో ఇందనం కూడా పార్టీ డబ్బులతోనే పోయించుకుంటాను.


కొందరు మిత్రులు నా ఖర్చు భరిస్తారని చెప్పారు. నేను పెట్టుకునే వాచీ రఫెల్ ఇండస్టీయల్ కు చెందినది. ఇది కూడా సి.హెచ్ రామకృష్ణ అనే మిత్రుడి దగ్గర రూ. 3 లక్షలకు కొన్నానని విలేకరులకు రిసిప్ట్ చూపించారు. 2021 మార్చిలో రిటైల్ వ్యాపారి నుంచి రామకృష్ణ కొంటే 2021 మే నెలలో  ఆయన దగ్గర కొనుక్కున్నానని అన్నామలై చెప్పారు.  


విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ చేసిన అన్నామలై వాచీ ఆరోపణల గురించి  ఇలా వివరణ ఇచ్చాడు. రఫెల్ ఫైటర్ లను తయారు చేసే డాసల్ట్ కంపెనీ తయారు చేసిన వాచ్ అది. ఈ వాచీ అరుదుగా దొరుకుందని దీన్ని ధరించడం నాకిష్టమని ఆయన చెప్పుకొచ్చారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలను 90 రోజుల్లో ప్రజలకు తెలిసేలా రిలీజ్ చేస్తానని అన్నామలై చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: