
అయితే ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి జగన్ కి భారమవ్వడంతో ఇప్పుడు మళ్లీ విజయ్ సాయి రెడ్డి పేరు వినిపిస్తుందని తెలుస్తుంది. మరి వై వి సుబ్బారెడ్డి విషయంలో అసలు జగన్ కి సమస్య ఏంటి అంటే, బాలినేని తో వివాదం అని తెలుస్తుంది. దాంతో బాలినేని కన్వీనర్ పదవి నుండి అలిగి పక్కకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. దాంతో మళ్లీ విజయ సాయి రెడ్డికి ఘనమైన స్వాగతం పలకబోతుంది వైయస్సార్ సిపి అని వాట్సాప్ గ్రూపు లో న్యూస్ వైరల్ అవుతుంది.
కానీ ఇక్కడ వినపడే మరో విషయం ఏమిటంటే, ఆయన్ని బాలినేని వదిలేసిన ప్లేస్ లో ఇంచార్జిగా నియమించబోతున్నారని తెలుస్తుంది. విజయ్ సాయి రెడ్డి పార్టీ ఆక్టివిటీస్ కు దూరమైన తర్వాత కేంద్రానికి సంబంధించి, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన ప్రెస్ మీట్ లకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన తిరిగి వైఎస్ఆర్సిపి లోకి వస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వస్తుంది. దీనిపై విజయ సాయిరెడ్డి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు .