ఎన్నో ఆయుర్వేద వాటిలో అవిసె గింజలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది శరీరంలో వాతాన్ని సమతుల్యంగా చేస్తాయని చెప్పవచ్చు. వీటిని చిన్న పిల్లలకు తినిపిస్తే మెదడుకు చాలా చురుకుగా పని చేసేలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అవిసె గింజలలో ఒమేగా-3,6 పుష్కలంగా లభిస్తాయి.దీంతో టెన్షన్ ,అల్జీమర్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే వీటిని తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలట.ఎందుచేత అంటే ఇది ఎక్కువ వేడిని కలిగిస్తాయి. వీటిని అధికంగా తింటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి చూద్దాం.


అవిసె గింజలు చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు మందులా కూడా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులు బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మీరు డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఈ విత్తనాలు మంచి హెల్తీగా పనిచేస్తాయి. తక్కువ బరువుతో బాధపడే వారు వీటిని తినడం వల్ల బరువుకి చాలా సహాయపడతాయి. వీటిని అధికంగా తినడం వల్ల హార్మోన్ల సమస్యలు వస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రెగ్నెంట్ కావాలనుకున్న.. శృంగార సమస్యలు ఉన్నవారు, అధిక వేడిని కలిగి ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం మంచిది.అయితే వీటిని బాగా నూరి లడ్డులా అయినా తినవచ్చు. లేదంటే పొడిలా చేసి దోసలో ఇడ్లీలో వంటి వాటిలో జత చేసి తినవచ్చు. ముఖ్యంగా ఏదైనా కూరలలో ఇ పొడి ని వాడుకోవచ్చు. అవిసె గింజలను బాగా వేయించి అందులోకి కాస్త ఉప్పు, కారం జోడించి బాగా నూరితే పొడిగా వస్తుంది. ఈ పొడి పలు ప్రయోజనాలను కలిగిస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎండాకాలంలో వీటిని తినకపోవడమే చాలా మంచిది ఎందుచేత అంటే వేడి ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తరుచు తిన్నట్లు అయితే.. అధిక వేడి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: