టాలీవుడ్ బ్యూటీ అయిన అంజలి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పేరుకు తెలుగమ్మాయి అయినా కూడా తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

తన అందం మరియు నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే అంజలి తెలుగువారిని మెప్పించలేకపోయింది. ఎక్స్పోజింగ్ విషయంలో తె కూడా మితిమీరి ఎక్స్పోజింగ్ చేసింది అయినా కూడా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అంతగా ఛాన్సులు మాత్రం ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం జెట్ స్పీడ్ లో  దుమ్ము రేపుతుంది.


చిత్ర పరిశ్రమ కు వచ్చి పది ఏళ్లకు పైనే అవుతున్న టాలీవుడ్ లో ఇంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చేయలేదు.. కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ను అయితే అందు కుంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని తెలుస్తుంది.. ఈ సినిమా హిట్ అయితే అంజలికి తిరుగు ఉండదు. ఇకపోతే అంజలి ప్రేమ, పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయటా.

 

ముందుగా ఆమె కోలీవుడ్ నటుడు జైతో కలిసి రిలేషన్ షిప్ లో ఉన్నారని సమాచారం.. వీరిద్దరు కలిసి మూడు నాలుగు ఏళ్ళు డిప్ ప్రేమ లో ఉన్నారని తెలుస్తుంది.. తర్వాత గ్యాప్ వచ్చి విడిపోయారటా.ఇక ఇప్పుడు అంజలికి తల్లిదండ్రులు మంచి సంబంధం కూడా చూశారని, పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.అంజలికి ఒకప్పుడు కుటుంబం తో విభేదాలు కూడా ఉండేవని తెలుస్తుంది. ఇప్పుడు అందరూ కూడా కలిసిపోవడం తో తల్లిదండ్రులను గౌరవించి పెళ్లికి రెడీ అయిందట. వరుడు తెలుగు అబ్బాయి అయినా కానీ చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తుంది. దీంతో అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: