చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. 2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బకి పార్టీలో కీలక నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీకి ఆర్థికంగా అండదండగా ఉన్న నాయకులు మెల్లమెల్లగా జగన్ పార్టీలోకి వెళ్ళిపోతున్న పరిణామాలు ఇటీవల చోటు చేసుకోవడంతో ...పార్టీ కేడర్ ని  కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా బాబుకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్థానిక టిడిపి నేతలు ఒక్కొక్కరు రాజీనామా చేయడంతో సొంత అడ్డాలో బలం నిరూపించుకోవడానికి చంద్రబాబు తెగ కంగారు పడిపోతున్నారట. 
 
పైగా స్థానిక ఎన్నికలు జరగక ముందే సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఇప్పటినుండే చోటు చేసుకుంటే.. రేపొద్దున్న సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని గెలిపించుకోలేని అపవాదు తనపై పడుతుందనే భావనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మారిపోవడానికి కారణం గతంలో చంద్రబాబు  ఏడాదికోసారి కుప్పనికి వెళ్లి పార్టీ కేడర్ ని పట్టించుకునేవారట. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పార్టీ 2019 ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలు కావడంతో, కనీసం నియోజకవర్గం మొహం కూడా చంద్రబాబు చూడటం లేదట. 
 
ఇదే టైమ్ లో జగన్ వచ్చాక కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేయటంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నియోజకవర్గంలో తల పెట్టడంతో కుప్పం ప్రజలు ఎక్కువగా వైసిపి పార్టీ చేస్తున్న పనులు గుర్తిస్తున్న తరుణంలో పార్టీ కేడర్ మెల్లమెల్లగా చేజారి పోతుందట. గతంలో చంద్రబాబుకి నియోజకవర్గానికి మధ్య పెద్ద వారధిగా ఉన్న పెద్దపెద్ద నాయకులు కూడా పార్టీ మారిపోయారట. దీంతో మిగిలి ఉన్న క్యాడర్ ని ఎలాగైనా కాపాడుకోవాలని చంద్రబాబు రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ క్యాడర్ ని రెడీ చేయాలని బాబు డిసైడ్ అయినట్లు టిడిపి పార్టీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: