జంతువులకు కరోనా వైరస్ సోకడం మానవ జాతిని మరింత కంగారు పెడుతుంది. జులో ఉన్న జంతువులు కరోనాతో ఇబ్బంది పడటం జూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా అట్లాంటా జూలలో కనీసం 13 గొరిల్లాలు కరోనా బారిన పడ్డాయని గుర్తించారు. మగ గొరిల్లాతో సహా 60 ఏళ్ల ఓజీ అనే గొరిల్లా కూడా కరోనాతో బాధపడుతుంది. గొరిల్లాలు దగ్గుతున్నట్లు, అలాగే జలుబుతో ఇబ్బంది పడటం ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు అక్కడ ఉన్న ఉద్యోగులు గమనించారు అని గుర్తించారు.

శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేసారు. జార్జియా విశ్వ విద్యాలయంలోని పశు వైద్య ప్రయోగశాలకు వాటి సాంపిల్స్ ని పంపించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని గుర్తించారు. అయోవాలోని అమెస్‌లోని నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ ల్యాబ్ నుండి కూడా ధృవీకరణ కోసం వేచి చూస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న గొరిల్లాలకు చికిత్స చేస్తున్నట్లు జూ ప్రకటన చేసింది. జూ నాలుగు ప్రాంతాలలో నివసిస్తున్న మరో 20 గొరిల్లాలకు కూడా పరిక్షలు చేస్తున్నారు.

వాటికి కరోనా ఎలా సోకింది అనే దానిపై అధికారులు ఆరా తీయగా లక్షణాలు లేని ఉద్యోగి కారణంగా కరోనా బారిన పడినట్టుగా భావిస్తున్నారు. అతనికి వ్యాక్సిన్ వేసుకున్నా సరే కరోనా సోకింది. మాస్క్ లు గ్లోవ్స్ ధరించినా అతనికి కరోనా వచ్చింది. వాటికి కరోనా రావడం పట్ల స్పందిస్తూ... మేము చాలా ఆందోళన చెందుతున్నాము... ప్రత్యేకించి గొప్ప కోతులు మరియు ఇతర ప్రమాదకరమైన జంతు జాతులతో పనిచేసేటప్పుడు మా భద్రతా ప్రోటోకాల్‌ లు జాగ్రత్తగా పాటిస్తాం. అవి చాలా కఠినం గా ఉన్నాయి అని జూ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సామ్ రివెరా మీడియాకు వివరించారు. జనవరిలో శాన్ డియాగో జూ సఫారీ పార్కులో ఎనిమిది గొరిల్లాలకు కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: