వరుసపెట్టి వైసీపీకి అదిరిపోయే విజయాలు దక్కుతున్నాయి...పంచాయితీ ఎన్నికల్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పని చేసింది. ఇక ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో అయితే కొత్త చరిత్రనే సృష్టించింది. మరి ఈ విజయాలన్నీ వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనమా? అంటే అసలు కాదనే చెప్పొచ్చు. ఈ ఫలితాలు కేవలం జగన్ బట్టే వచ్చేయని చెప్పొచ్చు.

పైగా ప్రతిపక్షాలకు ఓటు వేసిన ఉపయోగం లేదనే కోణంలో కూడా వైసీపీకి ఓటు వేసి ఉండొచ్చు. అంతే తప్ప పూర్తిగా ఈ విజయాలు ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనమని చెప్పలేం. ఉదాహరణకు టి‌డి‌పికి కంచుకోటగా ఉండే కృష్ణా జిల్లాలో వైసీపీ సూపర్ విక్టరీ కొట్టింది. మరి అక్కడ ఎమ్మెల్యేలు అదిరిపోయేలా పనిచేస్తున్నారా? ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటున్నారా? అంటే అసలు కాదనే చెప్పొచ్చు.

జిల్లాలో టి‌డి‌పి నుంచి వచ్చిన వంశీని కలుపుకుని వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టి‌డి‌పికి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మరి ఈ 15 మంది అదరగొట్టే పనితీరు కనబరుస్తున్నారా? అంటే లేదనే చెప్పొచ్చు. ఎందుకటే జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలకు మైనస్ మార్కులు పడుతున్నాయి. పైగా కొందరు జిల్లా రాజకీయాల్లోనే హైలైట్ కావడం లేదు. ఇందులో మంత్రులుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లని పక్కనబెడితే....మిగిలిన ఎమ్మెల్యేల్లో అద్భుత పనితీరు కనబర్చేవారు పెద్దగా లేరనే చెప్పొచ్చు.

 
జోగి రమేష్ లాంటి నాయకుడు దూకుడుగా రాజకీయం చేస్తారు గానీ, ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టడంలో దూకుడు ఉండదనే చెప్పొచ్చు. అటు పామర్రు ఎమ్మెల్యే అనిల్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ లాంటి ఎమ్మెల్యేలు ఇంకా ప్రజల్లో రిజిస్టర్ అవ్వలేదు.  అటు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదు. కానీ జనం మాత్రం జగన్‌ని చూసే వైసీపీకి భారీ విజయాల్ని అందిస్తున్నారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: