జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమో అయ్యింది. లేదంటే రోజుకో మాట, పూటకో రాజకీయం చేయరు. అసలు తాను రెండు రోజులక్రిందట ఏమి మాట్లాడాను, ఇపుడు ఏమి మాట్లాడుతున్నాను అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. తాజాగా కొండగట్టులో వారాహి వెహికల్ కు పూజలు చేయించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడినపుడు పొత్తుల గురించి ఎన్నికలకు వారం రోజులున్నపుడు మాత్రమే మాట్లాడుకుంటామన్నారు. బీజేపీతోనే జనసేనకు పొత్తుందని స్పష్టంగా చెప్పారు.





అయితే తెలుగుదేశంపార్టీతో పొత్తుగురించి కనీసం ప్రస్తావించలేదు. ఇక్కడే పవన్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షమని చెబుతారే కానీ ఆ పార్టీతో కలిసి పనిచేయటంలేదు. రణస్ధలంలో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. కానీ ఇపుడేమో కొత్తపొత్తులు కుదిరితే కొత్తగా వెళతాం లేకపోతే ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు వారం ముందుమాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తామని చెప్పిన పవన్ మరి రణస్ధలంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ఎందుకు ప్రకటించినట్లు ?





పవన్ చేసిన మరో ప్రకటన ఏమిటంటే ప్రజల కోసమే పోరాటాలు చేస్తారట. అసలు ప్రజలకోసం చేసిన పోరాటాలేమున్నాయి. పవన్ పోరాటమంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే. పైగా తెలంగాణాలో కూడా జనసేన పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణాలో జనసేన చేసిన పనేదీ లేదని అందరికీ తెలిసిందే. కొత్తపొత్తులు కుదిరితే కొత్తగా వెళతామని ప్రకటించటం ఏమిటో పవన్ కే తెలియాలి. కొత్తపొత్తులు కుదరకపోతే ఒంటరిపోరాటమేనట.





పవన్ మాటలు వింటుంటే జనాలకే కాదు పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా పిచ్చెక్కిపోతోంది. మాటమీద స్ధిరిత్వం ఉండదు, విషయ పరిజ్ఞానం కూడా లేదు. ఏరోజుకారోజు నోటికేదొస్తే అది మాట్లాడేస్తారు. పవన్ తాజా ప్రకటన వల్ల జనసేనలోనే కాదు టీడీపీ, బీజేపీలో కూడా అయోమయం పెరిగిపోతోంది. బీజేపీతో ధైర్యంగా తెగతెంపులు చేసుకోలేక, టీడీపీతో పొత్తు పెట్టుకోలేక నానా అవస్తలు పడుతున్నారు. ఇందుకనే ఏదేదో ప్రకటనలు చేసేస్తు అందరిలోను గందరగోళం పెంచేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: