జగన్మోహన్ రెడ్డి అనే పేరువింటేనే చంద్రబాబునాయుడు అండ్ కో కు ఒంటికి కారం రాసుకున్నట్లుంటుంది. అందుకనే జగన్ పై ఆరోపణలు, విమర్శలంటే బుర్రతో పనిలేకుండానే నోరుపారేసుకుంటుంటారు. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎంఎల్ఏ నిమ్మల రామానాయడు చేసిన ఆరోపణలే దీనికి ఉదాహరణ. నిమ్మల ఏమన్నారంటే బ్లాక్ మనీ అంతా జగన్ దగ్గరే ఉందట. ఆంధ్రప్రదేశ్ లో కనబడని రు. 2 వేల నోట్లు మొత్తం జగన్ దగ్గరకే చేరిందని ఆరోపించారు.

పెద్దనోట్ల రద్దుతో జగన్ వణికిపోతున్నారట. వచ్చేఎన్నికల్లో డబ్బులు వెదజల్లటం కోసమే జగన్ లక్షల కోట్ల రూపాయలను తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, లోటస్ పాండ్, బెంగుళూరులోని ఎలహంకలో కోట్లాదిరూపాయలను దాచిపెట్టినట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఏపీకి సంబంధించి రు. 2 వేల నోట్ల మార్పిడిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా జగన్, మంత్రులు, ఎంఎల్ఏలు వివిధ మార్గాల్లో 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందన్నారు.

ఇక్కడే నిమ్మల ఎంతటి మూర్ఖుడో అర్ధమవుతోంది. జగన్ మీద మాట్లాడటమంటే చాలు కాస్త లాజిక్ అన్నది అప్లైచేయాలని కూడా తమ్ముళ్ళు ఎందుకు అనుకోవటంలేదో అర్ధంకాదు. తాము ఏమి మాట్లాడినా ఎదురు ప్రశ్నించకుండా అచ్చేసే ఎల్లోమీడియా ఉందికాబట్టి బుర్రకు కాకుండా కేవలం నోటికిమాత్రమే తమ్ముళ్ళు పనిచెబుతున్నారు.  నిమ్మల ఆరోపణలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. బ్లాక్ మనీని ఎవరు  కూడా కిరాణాషాపుల్లో బియ్యం, పప్పులను బస్తాల్లో దాచుకున్నట్లు దాచుకోరు.

బ్లాక్ మనీని భూములు, బంగారం, వజ్రాలు, కంపెనీల్లో షేర్ల తదితర రూపాల్లో దాచుకుంటారు. అంతేకానీ నిమ్మల చెప్పినట్లు లక్షల కోట్లరూపాయలను బస్తాల్లో దాచుకోరు. రాష్ట్రంలో కనబడని 2 వేల రూపాయల నోట్లన్నీ తాడేపల్లిలోనే ఉన్నాయట. అప్పటికి రామానాయుడు తాడేపల్లి ప్యాలెస్లో చూసినట్లు చెప్పారు. ఆరోపణలు చేసేటపుడు కాస్త ఇంగితంతో చేయాలని కూడా నిమ్మలకు తోచకపోవటమే విచిత్రంగా ఉంది. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలాగ చంద్రబాబే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటే ఇక నిమ్మల లాంటి తమ్ముళ్ళుని ఆపేదెవరు ?

మరింత సమాచారం తెలుసుకోండి: