
దీంతో బిగ్ బాస్ హౌస్ లో అభిమానులను సంపాదించుకున్న అఖిల్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం అవకాశాలు దక్కించుకోలేక... ఎక్కడ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక ఎంతోమంది మరిచిపోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బీబీ జోడి అనే కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. టాలీవుడ్ నటి తేజుతో కలిసి డాన్స్ పర్ఫామెన్స్ లు చేస్తూ ఉన్నాడు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతూ ఉండడంతో వీరి పర్ఫామెన్స్ లకు మంచి మార్కులు వస్తున్నాయి.
అయితే వీరిద్దరూ కెమెరా ముందే కాదు కెమెరా బయటకు కూడా కాస్త క్లోజ్ గానే ఉంటున్నారు. దీంతో అఖిల్, తేజు మధ్య ఏదో ఉంది అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు అఖిల్ , తేజు. సుమ వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్న సుమ అడ్డ అనే కార్యక్రమంలో తేజుతో కలిసి పాల్గొన్నాడు అఖిల్. ఈ క్రమంలోనే మీ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసా అని సుమ అడగగానే.. అవును రిలేషన్షిప్ లో ఉన్నాం అంటూ చెబుతుంది తేజు. అయితే నేను దాని గురించి ప్రశ్న అడగాలని అనుకోలేదు అంటూ సుమ ట్విస్ట్ ఇస్తుంది. దీంతో నువ్వు అడగకుండానే వాళ్లే చెప్పేశారు అంటూ ఇక అక్కడే ఉన్న రోల్ రైడా అసలు నిజాన్ని మొత్తం రివీల్ చేస్తాడు. దీంతో అఖిల్ కి లవర్ దొరికేసింది అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.