జగనన్నకు కోపం వచ్చింది. ఏడాదిన్నర ముందే  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ బాస్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం  పోలీస్ బాస్ గా ఉన్న గౌతం సవాంగ్ ను బదిలీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జిఏడి లో రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ కు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కోన్నట్లు తేలిసింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా ?
 నెల్లూరు జిల్లా ఏస్పీ గా గతంలో పని చేసిన వ్యక్తి ప్రస్తుతం ఏ పీ పోలీస్ బాస్ కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంటలిజెన్స్  ఉన్నతాధికారిగా ఉన్న కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డిని పూర్తి అదనపు బాధ్యతలతో డిజిపిగా నియమిస్తూ అదేశాలు జారీ చేసింది. 1992 బ్యాచ్ కు చెందిన ఈయన గతంలో విజయవాడ, విశాఖ పట్టణం లలో పోలీస్ కమీషనర్ గా పని చేశారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయనతో పనిచేసిన పోలీసులు పేర్కోంటుంటారు. కసిరెడ్డి గతంలో ఔషధ నియంత్రణ అధికారిగా కూడా పనిచేశారు.  కాగా ఇప్పటి వరకూ పోలీస్ బాస్ గా ఉన్న గౌతం సవాంగ్ బదిలీకి కారణం ఏమిటనే విషయమై  విభిన్నమైన కథనాలు మీడియాకు అందుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయులు విజయవాడలో జరిపిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడం పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో సవాంగ్ విఫలమయ్యారని పలువురు వై.ఎస్.ఆర్ సి.పి నేతలు బాహాటంగానే  విమర్శలు చేశారు కూడా. ఇది జరిగిన కొద్ది రోజుల లోనే  సవాంగ్ బదిలీ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: