చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. ఈసారి ఎంతలా అంటే ఘోరాతి ఘోరంగా  చైనాలో కేసులు పెరుగుతున్నాయి చైనాలో కరోనా పై పూర్తిగా ఆంక్షలు ఎత్తేశారు. కరోనా వచ్చినా సరే  వచ్చినా సరే ఎక్కడికైనా వెళ్లొచ్చని ఏ ప్రాంతంలోనైనా తిరగచ్చని స్వేచ్ఛనిచ్చారు దీంతో అక్కడ కొన్ని వేలమంది లక్షల మంది చనిపోయారని అంచనా. చైనా నుంచి విదేశాలకు వెళ్ళిన వారు విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారు, ఇలాంటి వ్యక్తులతో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది.


ప్రస్తుతం కరోనా కేసులు చైనాను దాటి జపాన్, అమెరికా,ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయిలాండ్ మరో 50 దేశాలు కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 193 దేశాలలో మరొకసారి కరోనా ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో గత ఏడు రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.  జపాన్‌లో 9 లక్షల కేసులు వస్తే 2008 వందల మంది చనిపోయారు. ఇటలీ, బ్రెజిల్ లో కూడా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మూడు సంవత్సరాల కిందట చైనాలో మొదటిసారి కరోనా కేసులు బయటపడ్డప్పుడు ప్రపంచం మొత్తం వణికింది.  


చైనా చేయడం వల్ల ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు ఎంతోమంది ప్రాణాలు పోయాయి. చాలా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా సమయంలో మళ్ళీ చైనాలో కేసులు రావడం అవి అక్కడితో ఆగిపోకుండా ప్రపంచ దేశాలకు పాకడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికాలో గత ఏడు రోజుల్లో దాదాపు 4,000 మంది పైనే మృత్యువాత పడ్డారు. అంటే కరోనా ఇంతలా విర్చుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.


ఈ భయంకరమైన మహమ్మారిని తట్టుకోవడానికి ఆయా దేశాలు అక్కడి రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపు దృష్టి సారించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే చైనా ఈసారి తీసుకొచ్చిన కరోనా ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఎలాంటి విపత్తు సంభవిస్తుందోనని ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మళ్లీ కరోనని ఎదుర్కొనేందుకు అనే దేశాలు సమాయత్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: