
దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జయ్ భూయన్, తుకారం తో కూడిన డివిజన్ బెంజ్ ఇటీవల విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన తెలంగాణ చీఫ్ సెక్రటరీ, పాఠశాల ముఖ్య కార్యదర్శికి, డైరెక్టర్ లకు నోటీసులు జారీ చేసింది. స్కూల్స్ లో ఇచ్చే టీసీల్లో కులాల ప్రస్తావన ఉంటుంది. స్కూల్ రికార్డుల్లో మాత్రం కుల వివక్ష లేకుండా చూడాాలని నారాయణ కోరారు.
కులం అని తెలిస్తే విద్యార్థుల మధ్య వివక్ష ఏర్పడుతుందని అన్నారు. కులాన్ని బహిర్గతం చేయడం వ్యక్తిగత హక్కును భంగం కలిగించడమే అని నారాయణ ఫిటిషన్ లో పేర్కొన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉంటే సమాజానికి అవసరం అన్నారు. ఇది నిజమే కానీ రిజర్వేషన్ల విషయంలో కులం అనే ప్రస్తావన ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి కుల ప్రస్తావన లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కులాలకు చెందిన విద్యార్థులకు అందే సౌకర్యాలు ఏ విధంగా ఇవ్వగలరు.
ఉద్దేశ పూర్వకంగా నారాయణ వేసిన పిటిషన్ మంచిదే. కానీ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల మేలు కోసం పెట్టిన రిజర్వేషన్లు పొందాలంటే కులం అనే కాలం నింపాల్సిందే. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వం ఎలాంటి అంశాలను కోర్టు ముందు ఉంచుతుంది అనేది ఆసక్తి కరంగా మారాయి. కుల ప్రస్తావన అంశం రిజర్వేషన్లతో ముడి పడింది కాబట్టి కోర్టు తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.