ప్రస్తుత కాలంలో చాలా మంది యువత అధిక బరువుతో బాధపడుతున్నారు.20 నుంచి 30 ఏళ్లు దాటాకనే  స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇందుకోసం ఎన్నో ఫుడ్ డైటింగులు,ఎక్సర్సైజులు చేస్తున్నప్పటికీ అధిక బరువును జయించలేకపోతున్నారు. అంతేకాకుండా నిత్యం జిమ్ సెంటర్లకు వెళ్లి,వారి బరువును తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.  అయితే ఈ బరువును ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. మన సెలబ్రెటీలు కూడా 100 కేజీలకు  పైగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను  ముందే పాటించి వారు కూడా తమ అధిక బరువును తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆ చిట్కాలేంటో? వాటిని పాటించి మన అధిక బరువును ఎలా జయించాలో?ఇప్పుడు చూద్దాం.

నిత్యం వ్యాయామాన్ని మన దినచర్యలో భాగంగా  మార్చుకోవాలి.
విరామం ఇవ్వకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తే మంచిది. ఎందుకంటే మన శరీరంలో చెమట బయటకు వస్తేనే, శరీరంలోని కొవ్వు నిల్వల శాతం తగ్గి,అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్రమశిక్షణగా జిమ్ కు వెళ్తూ కసరత్తులు చేయడం ద్వారా క్రమంగా బరువు తగ్గుతారు.
అంతేకాకుండా పోషకాలు ఉండే ఆహార మెనూ ను  తయారు చేసుకోవడం మంచిది.
బరువు తగ్గించుకోవాలి అనుకుంటే స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరి.
ముఖ్యంగా జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చాలావరకు తగ్గించుకోవాలి. రాత్రిళ్లు భోజనం చేసే సమయం కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. రాత్రి లో ఎంత తొందరగా భోజనం చేస్తే అంత త్వరగా జీర్ణం అయ్యే అవకాశాలు ఎక్కువ.
అంతేకాకుండా ఉదయాన్నే లేవగానే పరగడుపున గోరు వెచ్చని నీటిలో, నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గే అవకాశం ఎక్కువ.
వీలైనంతవరకూ ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడానికి ట్రై చేయండి.
కాఫీ,టీలు తాగడానికి  బదులు గ్రీన్ టీని తాగడం ఎంతో ఉత్తమం. టీవీ చూసేటప్పుడు, మొబైల్ వాడేటప్పుడు భోజనం చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటి పై ఉన్న ధ్యాస ఫుడ్డు పైన ఉండదు.ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణం అవుతుంది.మీరు ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడితే వాటి స్థానంలో తాజా పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: