

తమిళంలో మంచి విజయం సాధించిన ‘LKG – 2020’ సినిమాను త్వరలో ఆహా స్ట్రీమ్ చేయబోతోంది. తమిళ యువ నటుడు ఆర్జే బాలాజీ భామ ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈమూవీకి కేఆర్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ విడుదల చేసిన ప్రోమోలో పవన్ ఇమేజ్ ని వాడుకోవడం ఆశ్చర్యంగా మారింది.

‘పవన్ సినిమాను చూసినంత మాత్రాన ఆ వ్యక్తి ‘జనసేన’ లో చేరినట్లేనా’ అనే పంచ్ డైలాగ్ పవన్ అభిమానుల మధ్య బాగా వైరల్ అవుతోంది. ఇదే సందర్భంలో ‘దేవుళ్ళారా మిమ్మల్ని ఈ చిన్న రూమ్ లో పెట్టి పూజిస్తున్నందుకు ఫీల్ అవ్వకండి.. త్వరలోనే నేను గొప్ప వాడినవుతాను.. మూడు వేల కోట్లతో మీకు విగ్రహాలు పెట్టిస్తాను’ అంటూ ఈమూవీ హీరో దేవుళ్ళకు ప్రామిస్ చేసిన డైలాగ్ వెనుక సామాజిక స్పృహ కనపడుతోంది.
