మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడని అలాగే హాలీవుడ్ ఫేమస్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ఒక పాట పడనుంది అని అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా వస్తున్న వార్తలకు ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ చెక్ పెట్టేసాడు. తాజా గా ఒక ఇంటర్వ్యూ లో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ... చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోయేది నిజమేనని తెలియజేశాడు.

చిరంజీవి , సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేయడం అనేది మాకు చాలా పెద్ద విషయం. అందు కే ఆ పాట స్థాయి కూడా చాలా పెద్దగా ఉండాలి. అందుకోసమే ఓ పెద్ద ఆర్టిస్ట్‌ (సింగర్, ఆర్టిస్ట్‌) కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం. అందు కోసమే కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీ లతో మాట్లాడుతున్నాం. వాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆడియో కంపెనీ ల తో మాట్లాడాలి అని తమన్ తెలియజేశారు. ఎందుకంటే విదేశీ ఆర్టిస్ట్‌లకు ఈ ఆడియో కంపెనీలతో చాలా మంచి అనుబంధం ఉంటుంది. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు అని తమన్ తెలియజేశాడు. బ్రిట్నీ స్పియర్స్‌ సంప్రదించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. బ్రిట్నీ స్పియర్స్‌ తో తెలుగు పాట పాడించాలా... లేక ఇంగ్లిష్‌ ట్రాక్‌ పాటించాలా... అనేది ఇంకా నిర్ణయించుకోలేదు’’ అని తమన్ తెలిపారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను  శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దీనితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి చిరంజీవి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: