కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ అయిన విషయం విదితమే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాపై భావిస్తాయిలో అంచనాలు నెలకొనగా అన్నిటిని పటాపంచాలు చేస్తూ ఈ చిత్రంలోని అత్యంత భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం అందరికి చెడ్డ పేరును తీసుకువచ్చింది అని చెప్పాలి. అంతే కాదు నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చింది.  ఈ సినిమాతో కొరటాల శివ దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా చేయడం ఆయనకు శాపం గా మారింది

సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన కలలో కూడా ఊహించలేదని చెప్పాలి. ఫ్లాప్ అవడం అనేది పక్కన పెడితే ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాన్ని తీసుకురావడం ఆయనకు డబ్బు పరంగా ఇటు పేరు పరంగా కూడా భారీ నష్టాన్ని తీసుకువచ్చింది. అలా కొరటాల శివ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు కొంతమంది బయ్యర్లు కొరటాల శివ ఆఫీస్ నందు బైఠాయించి తమ సినిమాల అప్పులను నష్టాలను ఎంతో కొంత పూర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారట దానికి ఎంతో కొంత సెటిల్ అయినా కూడా కొరటాల శివ లాంటి అగ్ర దర్శకుడు ఈ విధంగా ఇబ్బందులను ఎదుర్కోవడం నిజంగా ఎంతోమందిని బాధ కలిగిస్తుంది 

దర్శకుడిగా ఆయన ఏ స్థాయిలో సినిమాలను చేస్తారో అందరికీ తెలిసిందే ఇప్పటిదాకా ఒక ప్లాప్ ను కూడా ఎరుగని దర్శకుడు ఇప్పడు ఇంతటి భారీ స్థాయిలో ప్లాపును ఎదుర్కొని నిర్మాతగా ఫెయిల్ అవ్వడం నిజంగా ఆయన అభిమానులను నిరాశపరిచే విషయమే. ఈ నేపథ్యంలో ఆయనను ఆదుకోవడానికి రంగంలోకి ఎవరు దిగక పోవడం ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. మహేష్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన కొరటాల శివ వారి సహాయం తీసుకుని ఈ సమస్య నుంచి బయట పడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు మరి ఇప్పుడు చేయబోయే ఎన్టీఆర్ సినిమాతో ఆయన మళ్ళీ ట్రాక్లోకి వస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: