పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఎదురు చూడని అభిమానులు అయితే లేరు.. ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్ డే రోజు కొత్త సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశ పడుతుంటారు..

మరి ఈసారి కూడా ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా నుండి బర్త్ డే బ్లాస్ట్ ఉందని కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను కూడా ఇచ్చారు..

ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకో నున్నారు అనే సంగతి తెలిసిందే.. మరి రేపే ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా అయితే ఉన్నారు.. ఈ ఎగ్జైటింగ్ ను మరింత పెంచుతూ ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ట్రీట్ రెడీ చేసారట మేకర్స్.. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''NTR30''..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఈ రోజు సాలిడ్ అప్డేట్ అయితే రాబోతుంది.. ఈ రోజు రాత్రి 7 గంటల 2 నిముషాలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్టు తాజాగా అదిరిపోయే మోషన్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేయగా ఈ పోస్టర్ తోనే సాలిడ్ బజ్ పెరిగి పోయిందట.. చూడాలి వేరే లెవల్లో ప్లాన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ఏ విధంగా ఆకట్టు కుంటుందో.. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగు పెట్టబోతోందట.. అలాగే విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారని తెలుస్తుంది... అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల అవ్వబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: