కొన్ని రోజుల క్రితం మలయాళం లో విడుదల అయిన 2018 అనే సినిమా అక్కడ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా ఈ సినిమా ఆ ప్రాంతంలో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బాస్టర్ అవడంతో తాజాగా ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు.

మూవీ కి తెలుగు లో కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 1.96 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో 2.37 కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 2.02 కోట్ల షేర్ ... 4.33 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 1.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇంకో 0.02 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: