హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇక మరొక హీరో సుహాస్ కూడా ఎప్పుడు విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఉప్పుకప్పురంబు. డైరెక్టర్ శశి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. జులై 4వ తేదీన స్ట్రిమింగ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయగా బాగా ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.


ఉప్పుకప్పురంబు సినిమా ట్రైలర్ కూడా కచ్చితంగా కీర్తి సురేష్ కెరీర్ కి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విషయానికే వస్తే ఒక ఊరిలో స్మశానంలో మనుషులు పూడ్చుకోవడానికి చోటు అయిపోతుంది. రెండుర్లకు ఒకే స్మశానం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో కేవలం నలుగురికి మాత్రమే అక్కడ స్థలం ఉన్నదంటూ చూపిస్తారు. మరి ఆ నాలుగు స్థలాలు ఏ ఊరి వాళ్ళు దక్కించుకుంటారనే కథాంశంతో తెరకెక్కించారు. ముఖ్యంగా కీర్తి సురేష్ ఊరికి సర్పంచ్ గా కనిపిస్తోంది. కీర్తి సురేష్ చెప్పే డైలాగులు కూడా కామెడీగా అనిపిస్తున్నాయి.


సుహాస్ కూడా మరొకసారి పల్లెటూరి పాత్రలో కనిపించి అబ్బురపరిచేలా ఉన్నారు. మొత్తానికి కీర్తి సురేష్ ట్రైలర్ తోనే అదరగొట్టేస్తోంది. మరి సినిమా పూర్తి రివ్యూ తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ లో ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన కూడా అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. దీంతో పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది కీర్తి సురేష్. వివాహం తర్వాత గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో మరింత హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: