
ధనుష్ , నాగార్జున హీరో లోగా శేఖర్ కమ్ముల తెర్కక్కించిన లేటెస్ట్ మూవీ కుబేర .. తాజా గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది . అలాగే రోజు రోజుకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా సత్తా చాటడం తో ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ నెంబర్స్ ను అందుకుంటుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది .. అలాగే నిన్న కుబేర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు .
మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో లో కుబేర కు సంబంధించి ఏకంగా వన్ మిలియన్ ప్లస్ టిక్కెట్లు అమ్ముడైనట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది .. అంతేకాకుండా ఇంకా సాలిడ్ గా టికెట్స్ బుక్ అవుతూనే ఉన్నాయి .. దీంతో బాక్సాఫీస్ దగ్గర కుబేర ర్యాంపేజ్ మామూలు గా లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో కుబేర సినిమా తో థియేటర్లు ఉత్సాహంగా కలకలాడుతున్నాయి . ప్రేక్షకుల హృదయాలు గర్జిస్తున్నాయి .. స్క్రీన్ లు వెలుగుబోతున్నాయి .. ఇది టాలీవుడ్ లోనే అద్భుతమైన గొప్ప బ్లాక్ బస్టర్ అంటూ సినిమా యూనిట్ పోస్ట్ పెట్టింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..