అల్లం టీ అనేది అనేక మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజువారీగా తీసుకునే ఒక సాధారణ పానీయం. అయితే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల లేదా శరీరానికి తగిన విధంగా తగ్గించకుండా వాడితే కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రకృతి సిద్ధమైనా, అతి సారిగా వాడితే ఏదైనా దుష్ఫలితాలను కలిగించవచ్చనే సంగతిని గుర్తుంచుకోవాలి.

అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల  గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అజీర్తి, కడుపు మంట, తేలికపాటి నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. హైపోటెన్షన్ ఉన్న వారు అల్లం టీ తాగితే రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు. అలాగే, రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు తీసుకుంటున్నవారు అల్లం టీ తాగినట్లయితే రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

గర్భవతుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల గర్భాశయంలో నొప్పులు లేదా హార్మోన్లలో మార్పులు కలగవచ్చు. శరీరానికి వేడి ఎక్కువై మలబద్ధకం లేదా వేడి లక్షణాలు పెరగవచ్చు. కొన్ని మందులకు అల్లంలో ఉండే సహజ రసాయనాలు ప్రతికూలంగా పనిచేసే అవకాశముంది.

అల్లం టీ  తాగడం వల్ల కొంతమందికి చర్మంపై ర్యాషెస్, ఊపిరితిత్తుల సమస్యలు వంటి ప్రతికూల స్పందనలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా రోజుకు రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ఇలాంటి ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది.

కాబట్టి, అల్లం టీ అనేది కొంతమేర ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. శరీర తత్వానికి అనుగుణంగా తీసుకునే విధానాన్ని పాటించాలి. ఏ పానీయం అయినా పరిమితిలో ఉండినప్పుడే ప్రయోజనం కలిగిస్తుంది. అతి హద్దులు దాటితే  విషం అన్న చందంగా అల్లం టీ విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: