కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ సంచలనం రేపుతోంది. సౌత్ స్టార్స్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే ధనుష్.. తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య నుంచి విడి పోతాడని అసలు ఎవరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ధనుష్ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా చిన్న కుమారుడు ధనుష్. ఇక ధనుష్ అన్నయ్య డైరెక్టర్ సెల్వరాఘవన్.

ఈయన తెలుగులో 7/G బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ధనుష్ - ఐశ్వర్య రెండు సంవత్సరాల ప్రేమ అనంతరం 2004లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ కు కుమార్తె గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నేపథ్యగాయనిగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు భర్త ను హీరోగా పెట్టి 3 అనే సినిమాను కూడా తీసింది. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడంతో మీడియాలో ఈ జంట ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరూ ఉమ్మడిగా సంపాదించిన ఆస్తుల విలువ రెండు వందల కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. ధనుష్ ఆస్తి ఒక్క 2020 సంవత్సరం లో 145 కోట్లు. గత సంవత్సరం ఇది 160 కోట్లు దాటేసింది.ఒక్కో సినిమాకి ధనుష్ 7 నుంచి 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. గత ఐదేళ్లలో ధనుష్ నికర ఆస్తుల విలువ రెండు కోట్లకు పెరిగినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర వ్యాపారాలు,ప్రకటనలతో పాటు నిర్మాతగా కూడా మారాడు ధనుష్. ఇక తన కుటుంబంతో చెన్నైలో ఒక ఖరీదైన ప్రాంతంలో ఉండే ఇంట్లో నివసిస్తున్నాడు ధనుష్. ఇప్పటి వరకూ తన భార్య ఐశ్వర్య తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న బంగ్లా విలువే సుమారు 30 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.ఇక ఐశ్వర్య వృత్తిరీత్యా సంవత్సరానికిగాను ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకూ సంపాదిస్తుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: