
ఈ సినిమా 2 కోట్ల 70 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా, ఇప్పటికే టార్గెట్ ను రీచ్ అయ్యి 18 వ తేదీ రిలీజ్ అయిన సినిమాలలో గాలోడు మూవీ క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ విజయం దక్కిన సంతోషంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకుంటూ మరో ప్రాజెక్ట్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ముచ్చటగా మూడోసారి సుధీర్ తో సినిమాను తెరకెక్కించడానికి ఈయన పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమాలో సుధీర్ కు జోడీగా బుల్లితెర యాంకర్ లలో బ్యూటీ గా నిలిచిన రష్మిని ఎంచుకున్నట్లు సమాచారం. వీరి బుల్లితెర లవ్ ట్రాక్ ఎంత ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే.
అందుకే ఈ పెయిర్ ను వాడుకోవడానికి గాలోడు డైరెక్టర్ రెడీ అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు హీరో సుధీర్. సుధీర్ తర్వాత సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.