మధురం అనే షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  మధురం షర్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న చాందిని చౌదరి ఆ తర్వాత సుహాసి హీరోగా తెరకెక్కిన కలర్ పోటీ మూవీ ద్వారా మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. కలర్ ఫోటో సినిమా థియేటర్ లలో కాకుండా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తర్వాత చాందిని చౌదరి అనేక సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల అయిన సమ్మతమే సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.

మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు. అలాగే సూపర్ ఓవర్ అనే మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా నెటిజన్ లను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.  కొంత మంది వ్యక్తులు తన పేరును ఉపయోగించి వేధింపులకు పాల్పడుతున్నారు అని , జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్ లో నా పేరును ఉపయోగిస్తూ మెసేజ్ లు పంపిస్తున్నారు , మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి అని చాందిని చౌదరి సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: