
ఒకప్పుడు టీవీ యాంకర్ గా పని చేసిన సుజాత ఇక ఇటీవల కాలంలో అయితే జబర్దస్త్ లోకి వచ్చి ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ తో సుజాత లవ్ లొ పడింది. ఇక వీరు ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం చివరికి పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజాత. రాకేష్ తో తన ప్రేమ పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
రాకేష్ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు టీం లీడర్ గా ఎదిగాడు అంటూ సుజాత వెల్లడించింది. టీ లీడర్స్ స్థాయికి చేరుకోవడం అంత సులభమైన విషయం కాదని.. ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం అవదు అంటూ సుజాత చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా తన టీమ్ లో చేస్తున్నందుకు రాకేష్ తనకు రెమ్యూనరేషన్ ఇస్తాడు అంటూ సుజాత తెలిపింది. పెళ్లికి ముందు కట్నం ఎంత కావాలని మా అమ్మ నాన్న రాకేష్ ను అడిగారు. అయితే మీ పిల్లని ఇస్తే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు రాకేష్ చెప్పాడని సుజాత తెలిపింది. ఆయన అలా అనడంతో ఆయనపై ఉన్న ప్రేమ మరింత పెరిగిపోయింది అంటూ సుజాత చెప్పుకొచ్చింది.