సుకుమార్ శిష్యులకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. కుమారి 21ఎఫ్ తో సూర్య ప్రతాప్, ఉప్పెనతో బుచ్చి బాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఇలా సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన వారంగా కూడా తొలి సినిమాతోనే తమ ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలో సుకుమార్ శిష్యుల డైరెక్షన్ లో సినిమా అంటే మాత్రం ఆ ప్రాజెక్ట్ లకు సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన మరోకరు ఇప్పుడు డైరెక్టర్ గా మారుతున్నాడని తెలుస్తుంది.

యువ హీరో రాజ్ తరుణ్ తో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో సుకుమార్ హ్యాండ్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కుమారి 21ఎఫ్ సినిమా చేశాడు రాజ్ తరుణ్. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ టైం లో సుకుమార్ ఇచ్చిన బూస్టింగ్ తో కెరీర్ సెట్ రైట్ చేసుకుంటాడు అనుకున్న రాజ్ తరుణ్ గాడి తప్పాడు. కొన్నాళ్లుగా అతనికి సరైన హిట్లు లేక కెరీర్ లో చాలా వెనకపడి ఉన్నాడు.

అయితే సుకుమార్ సినిమాతో మళ్లీ రాజ్ తరుణ్ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. మరి కుమారి 21ఎఫ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా రాజ్ తరుణ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి. రాజ్ తరుణ్ ఈ సినిమాతో అయినా ఫాం లోకి వస్తాడా లేడా సుకుమార్ సపోర్ట్ యువ హీరో కెరీర్ ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తెస్తుందా లేదా అన్నది చూడాలి. ఇంతకీ సుకుమార్ అసిస్టెంట్ ఎలాంటి కథతో రాజ్ తరుణ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ కి ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: