అల్లు అర్జున్ ..ఓ పాన్ ఇండియా స్టార్ ..ఐకాన్ స్టార్ ఏ కాదు కొత్తదనానికి నాంది పలికే హీరో అని కూడా అనాలి.  అలాంటి ఎన్నెన్నో కొత్త పద్ధతులను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు హీరో అల్లు అర్జున్ . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాలో ఆయన చీర కట్టుకొని డాన్స్ చేసిన పర్ఫామెన్స్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము . అంతలా ఆయన సినిమా కోసం తన పర్సనల్ ఇమేజ్ ని కూడా పక్కన పెట్టేసారు.  ఒక బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ పైగా పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరో .. ఈ విధంగా చీర కట్టుకొని నటించడం .. డాన్స్ చేయడం అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ తో కూడిన విషయం.


కానీ అల్లు అర్జున్ అలాంటివన్నీ పక్కన పెట్టేసి కేవలం పుష్పరాజ్ కధనే నమ్ముకున్నాడు.  పుష్ప రాజ్ క్యారెక్టర్ లో లీనమైపోయాడు.  పుష్ప రాజ్ కోసం ఏదైనా చేయాలి అంటూ డిసైడ్ అయిపోయాడు.  ఈ మూమెంట్ లోనే పుష్ప రాజ్ కోసంఏకంగా చీర కట్టుకొని డాన్స్ చేశాడు . పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే . అయితే ఇప్పుడు అట్లీ దానికి మించిన రేంజ్ లోనే అల్లు అర్జున్ ని చూపించబోతున్నాడట . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా కోసం రకరకాల కొత్త ప్రయోగాలను ట్రై చేస్తున్నారట.



మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయ్ర్ల్  షేడ్స్ లో కనిపించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమాలో డాన్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట.  దీనికోసం అల్లు అర్జున్ పూర్తిగా తన బాడీ మోడ్యూలేషన్ ని మార్చుకునేయాలి .. ఒక డాన్ ఎలా బిహేవ్ చేస్తారో అలానే ఉండాలి .. ఆ హుందాతనంలో ఉండాలి ఆ రేంజ్ లోనే అల్లు అర్జున్ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారట . ఒక డాన్ దేశాన్ని రూల్ చేస్తే ఏ విధంగా ఉండబోతుందో అల్లు అర్జున్ ఈ సినిమాలో చూపించబోతున్నాడట అట్లీ . ఇది నిజంగా వెరీ టఫ్ జాబ్ అంటున్నారు జనాలు . పుష్ప లాంటి ఒక మాస్ క్యారెక్టర్ తర్వాత వెంటనే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లో ఎలా సూట్ అవుతాడు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: