
బంగారం రేటు ఆకాశాన్నంటడంతో బంగారం జోలికి పోవాలంటేనే భయపడుతున్నారు. మహిళలు బంగారం ప్రియులు అన్న విషయం అందరికి తెలిసిందేమహిళలు అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడేది ఒక్క బంగారం. ఎప్పుడూ ఏదో ఒకటి బంగారు నగలు చేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు . బంగారం ధరిస్తే తామంతా అందంగా ఇంకెవరు ఉండరని భావిస్తున్నారు. అరిచేతిలో కొంచెం డబ్బులు ఉన్న వాటిని బంగారంపై వెచ్చించేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.
బంగారం అంటే ఎంతో ఇష్టమైన అప్పటికి కూడా బంగారం ధరను చూసి కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇక బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడెప్పుడు కొనుగోలు చేద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహిళలు. అయితే బంగారం ఒక్క మహిళలకే కాదు అందరు తెగ ఇష్టపడతారు . ఎక్కువ బంగారాన్ని ధరించడం ఒక గౌరవంగా భావిస్తుంటారు జనాలు. అయితే ప్రస్తుతం ఆకాశాన్నంటిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఏకంగా 40 వేలకు చేరిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. రెండు నెలల కాలంలో దాదాపు రెండు వేల రూపాయలు తగ్గింది బంగారం ధర.
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,450 వద్ద ఉంది. ఇక అదే 24 క్యారెట్ల బంగారం ధర 38,983.96 వద్ద కొనసాగుతోంది. అంతే కాకుండా ఇంకో శుభవార్త ఏమిటంటే రాబోయే కాలంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి నాటికి బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం కారణంగానే పసిడి ధరలు తగ్గు ముఖం పడుతు వస్తున్నాయని చెబుతున్నారు. కాగా ప్రస్తుతానికి పసిడి ధరలు తగ్గినప్పటికీ... మనదేశంలో ఈ ఏడాది బంగారం ధర 20 శాతం పెరిగింది.