గడిచిన 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ తన సమీప టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ మీద ఓడిపోవడం జరిగింది. కానీ సీఎం జగన్ కు మోపిదేవి ఎంత సన్నిహితుడో విశ్వాసపాత్రుడో తెలిసిందే.. అందుకే ఎమ్మెల్యే గా గెలవకపోయినప్పటికీ ఎమెల్సీని చేసి మంత్రివర్గంలో చోటును కల్పించారు. ఆ తరువాత కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి లను రాజ్యసభకు పంపించడం జరిగింది. అలా మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఎంపీ అయ్యారు.. చట్టం ప్రకారం ఈయన పదవీ కాలం 2026 వరకు ఉండనుంది.

కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024 లో ఉండనున్నాయి. ఇటువంటి సందర్భంలో రేపల్లె నుండి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు అన్న దానికి రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మోపిదేవి వెంకటరమణ కొడుకు రాజీవ్ ను ఎమ్మెల్యేగా బరిలో నిలపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సీనియర్ రాజకీయ నాయకుడు మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అనగాని సత్యప్రసాద్ ను ఓడించడానికి ఓనమాలు నేర్చుకున్తున్నా రాజీవ్ సరిపోతాడా అన్నది ఇక్కడ బలంగా వినిపిస్తున్న వాదన .

మరి ఇందుకు జగన్ సరే అంటాడా ? లేదా ఏకంగా మోపిదేవిని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటాడా అన్నది ప్రస్తుతానికి రేపల్లె నియోజకవర్గ రాజకీయనాయకుల మదిలో ఉన్న ప్రశ్న ? రాజ్యసభ ఎంపీగా రెండేళ్ల పదవీ కాలం వదులుకునేంత సాహసం చేస్తాడా ? లేదా తన బదులు కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపి ఏనుగు మీద పిచుకను బ్రహ్మాస్త్రంగా వదిలే సాహసం చేస్తారా అన్నది సందిగ్ధంలో ఉంది. చివరికి జగన్ ఏది చేయమంటే అది చేయడానికి మోపిదేవి వెంకటరమణ సిద్ధంగా ఉంటాడని తెలిసిందే. ఈ చిక్కుముడి ఎలా ఎప్పడు వీడుతుందో చూడాలి .      








 

మరింత సమాచారం తెలుసుకోండి: