ప్రత్యర్ధులను వెంటాడటంలో ఎల్లోమీడియా, టీడీపీ రెండింటిగురించి అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఎల్లోమీడియా-టీడీపీ మధ్య క్విడ్ ప్రోకో ఆ స్ధాయిలో అవగాహనుంది. అలాంటిది ఏకకాలంలో అటు ఎల్లోమీడియాకు ఇటు టీడీపీకి ప్రత్యర్ధిగా తయారైన వాళ్ళని వదిలిపెడతారా ? ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శి చీటింగ్ పై రామోజీరావును ఉండవల్లి దుంపతెంపేస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శి ముసుగులో దశాబ్దాలుగా రామోజీ చీటింగ్ చేసిన విషయం దాదాపు నిర్ధారణైపోయింది. కోర్టు అధికారికంగా తేల్చాలంతే.

రామోజీని వెంటాడి, సీఐడీ విచారణ ముందుకు తీసుకెళ్ళి, సుప్రింకోర్టు విచారణలో ఇబ్బంది పెడుతున్న ఉండవల్లంటే చంద్రబాబునాయుడు అండ్ కో కు బాగా మండిపోతోంది. ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్యకేసుపైన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అలాగే  జగన్మోహన్ రెడ్డి పాలనపైన వ్యతిరేకంగా మాట్డనని ఉండవల్లి ప్రకటించారు.  ఈ రెండింటిని ఏకంచేసి టీడీపీ ఓ రేంజిలో ఉండవల్లిపై బురదచల్లేస్తోంది. నిజానికి వివేకా హత్య కేసు వేరు, రామోజీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ వేరు.

రామోజీ చీటింగ్ పై 2006 నుండి ఉండవల్లి పోరాడుతున్నారు. వివేకా హత్య జరిగింది 2019లో. రామోజీ కేసులో ప్రభుత్వం ఇంప్లీడవ్వటంతో  ఉండవల్లి పోరాటానికి ఎక్కడలేని బలమొచ్చింది. దాంతోనే ఇపుడు రామోజీ తల్లకిందులవుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు బలమంతా ఎల్లోమీడియానే. అలాంటి ఎల్లోమీడియానే ఇబ్బందుల్లో పడిపోతే చంద్రబాబు పనిగోవిందానే.

ఇక వివేకా హత్యకేసు గురించి ఉండవల్లి ఎందుకు పట్టించుకోవాలి ? జగన్మోహన్ రెడ్డి పాలనలో జనాలంతా నానా అవస్తలు పడుతున్నారన్నది చంద్రబాబు ఆరోపణ. నిజంగానే జనాలు ఇబ్బందులు పడుతున్నారా లేదా అన్నది అనవసరం. వచ్చేఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జగన్ అంటే మంటుంది. మరి అదే మంట అందరికీ ఎందుకుంటుంది ? ఉండవల్లికి ఉండాలని ఏముంది ? పైగా మార్గదర్శి కేసులో ప్రభుత్వం ఇంప్లీడయ్యింది కాబట్టి ప్రభుత్వానికి తాను వ్యతిరేకంగా మాట్లాడటంలేదని ఉండవల్లి స్పష్టంగా చెప్పారు. దీనికే ఉండవల్లిపైన టీడీపీ ఫుల్లుగా బురదచల్లేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: