గత కొన్ని నెలల నుంచి కూడా సొంత గడ్డపై భారత జైత్రయాత్ర కొనసాగుతూ వస్తుంది. ఎలాంటి పటిష్టమైన జట్టు భారత పర్యటనకు వచ్చినా కూడా స్వదేశీ పరిస్థితులను వినియోగించుకుని అద్భుతం గా రాణిస్తుంది భారత జట్టు.. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు అటు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరూ ఊహించినట్లుగానే భారత జట్టు అటు ఆస్ట్రేలియాపై ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం సాధించింది.


 నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా జట్టు.. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. దీంతో 2-1 తేడాతో అటు ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే వన్డే సిరీస్ లో మాత్రం అటు ఆతిధ్య  టీమిండియా జట్టుకు ఊహించని షాప్ తగిలింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్ లలో చెరొక మ్యాచ్ గెలిచాయి ఆస్ట్రేలియా, భారత్ జట్లు. ఇక సిరీస్ గెలుచుకోవాలంటే  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అటు భారత జట్టు చేతులెత్తేయడంతో  ఇక చివరి మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంది.


 అయితే ఇలా మూడో మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా అటు టీమ్ ఇండియాకు నాలుగేళ్ల జైత్రయాత్రకు బ్రేక్ పడింది అని చెప్పాలి. స్వదేశంలో వరుసగా సిరీస్ లలో విజయం సాధిస్తూ వచ్చిన టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది   గత నాలుగేళ్లలో భారత్ అన్ని ఫార్మట్ లలో వరుసగా భారత్ వేదికగా జరిగిన 24 సీరీస్ లలో విజయం సాధించింది. రెండు మ్యాచ్లు కూడా డ్రాగ ముగిశాయి. చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియాపై 3-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. అలాగే రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో తొలిసారి ఓటమి చవిచూసింది టీమిండియా. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్గా 14 సిరీస్ లలో గెలిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: