శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేెంద్ర షార్ లో పండుగ వాతావరణం నెలకొంది. కోవిడ్-19 మూలంగా ఇటీవలి కాలంలో అంతరిక్ష వాహక నౌకలు షార్ నుంచి నింగిలోకి ఎగర లేదు.  దీంతో కొంత కాలంగా అక్కడ స్తబ్దత వాతావరణం ఉండింది. ప్రస్తుతం  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సి 52 సూక్షంగా చెప్పాలంటే (పి.ఎస్.ఎల్.వి) ఈ నెల 14 అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. ఇందుకు సంబంధించి రిహార్సల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి పదకుండు గంటల పైన ఆరంభమైన ఈ రిహార్సల్స్ శనివారం పూర్తయింది.  ఇస్రో అధిపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సోమనాథ్ షార్ సెంటర్ ను సందర్శించే సమయానికికే స్థానిక శాస్త్రవేత్తలు రిహార్సల్స్ ను పూర్తి చేసారు. సోమనాథ్ ఇస్రో చైర్మన్ హోదాలో తొలిసారి శ్రీహరికోట లోని షార్ సెంటర్ కు శనివారం విచ్చేశారు. రోజంగా ఆయన బిజీ బిజీగా గడిపారు. షార్ లోని సమావేశ మందిరంలో తొలుత అవుట్ సైడ్ ఏజెన్సీలతో సమావేశమైన ఆయన అంత రిక్ష వాహక నౌక కు సంబంధించిన అన్ని అంశాలపై  సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత షార్ సెంటర్ లోని భాస్కర అతిథి భవనంలోని సమావేశ మందిరంలో షార్ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. పి.ఎస్.ఎల్.వికి  ప్రయోగానికి సంబంధించిన డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లతో పరిస్థితిని సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆదివారం వేకువ ఝామున అంటే 4.29 నిమిషాలకు కౌంట్ డౌన్ ఆరంభమైనట్లు షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ దాదాపు25.30 గంటల పాటు కొనసాగుతుంది. ఆ తరువాత సోమవారం ఉదయం 5.59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సి 52 నింగిలోకి వెళ్లనుంది. ఈ వాహక నౌకలో1710 కిలోల బరువున్నఆర్ ఐ శాట్ ప్రధాన మైనది, దీనినే ఈ వోఎస్-04 గా వ్యవహరిస్తారు. దీనితో పాటు 17.5 కిలోల బరువున్నఐ.ఎస్.ఎస్-2టిడీ సహా పులు ఉపగ్రహాలున్నాయి. విద్యార్థులు రూపొందించిన ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాన్ని కూడా ఈ అంతరిక్ష వాహక నౌక నింగిలోకి తీసుకువెళ్ల నుంది.
ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఇప్పటి వరకూ షార్ పాటి స్తున్న సంప్రదాయాన్ని పాటించారు. స్థానిక అధికారుల మన్ననలు పొందారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఎప్పడు రాకెట్ ను ప్రయోగించినా సదరు రాకెట్ నమూనాను తిరుమల శ్రీ వేంకటేశ్వరును పాదపద్మాల చెంత ఉంచి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ తరువాత రాకెట్ ను సూళ్లూరుపేట చెంగాళమ్మతల్లి వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఇదే ఆనవాయితీని డాక్టర్ సోమనాథ్ పాటించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సి 52 నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: