అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షోలో సినిమాల గురించి ప్రశ్నించడంతో పాటు బాలయ్య మోహన్ బాబుల మధ్య జరిగిన పర్సనల్ విషయాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు బ్రహ్మిని పై చేయి చేసుకున్న ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇద్దరికీ ఒకరి కి ఒకరు తెలియని సమయంలో మంచు మనోజ్ బ్రాహ్మణి ని కొట్టాడని తెలిపారు. అయితే ఆ సమయంలో బ్రాహ్మణి ఏడ్చుకుంటూ వసుంధర దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసిందట. 

దాంతో వసుంధర మనోజ్ కు వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా మంచు విష్ణు తనకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కానీ తనకు మరియు తన తల్లికి విష్ణు అబద్ధాలు చెబుతాడని లక్ష్మీ చెప్పుకొచ్చింది. అయితే తాను లక్ష్మీ మాటలే నమ్ముతానని బాలయ్య అన్నారు. కానీ మంచు విష్ణు ను నమ్మలేనని బాలయ్య చెప్పారు. అయితే మనోజ్ బ్రాహ్మణి పై ఎందుకు చేయి చేసుకున్నాడో మాత్రం బయటపెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: