కరోనా విజృంభించిన సమయంలో మొదటి లాక్ డౌన్లో ఇండియా ఎన్నో కష్ట నష్టాలను చవిచూసింది.  ముఖ్యంగా మొదటి లాక్ డౌన్ పెట్టిన సమయంలో కూలీలు, కార్మికులు కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఇదంతా అందరి కళ్ళముందే జరిగింది. దీనిని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఎంతగానో విమర్శించాయి. ఒక ప్రణాళిక లేకుండా పెట్టిన లాక్ డౌన్ వల్ల ఎంతోమంది చనిపోయారని మరెందరో అష్ట కష్టాలు పడ్డారని తీవ్రంగా విమర్శించాయి.


ప్రస్తుతం చైనాలో కోటానుకోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో శవపేటికలు కూడా చాలని పరిస్థితి అక్కడ నెలకొంది. కానీ అప్పటి భారత ప్రభుత్వం కరోనా మొదటి సమయంలో లాక్ డౌన్ విధించడం  సరైన నిర్ణయమేనని ప్రస్తుతమనిపిస్తుంది. ఒకవేళ ఆ సమయంలో లాక్ డౌన్ పెట్టకపోతే ప్రస్తుతం భారత దేశ పరిస్థితి కూడా ఇప్పుడు చైనా లాగే ఉండేది.


అలాంటి పరిస్థితిని తప్పించింది కేంద్రంలోని ప్రధాని మోడీ భాజపా ప్రభుత్వం. అప్పటికప్పుడు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని సడలింపులు సైతం కూడా ఇచ్చారు. ఎంతోమంది పాదచారులకు కూలీలకు, కార్మికులకు అన్నదానం,  నీటిని అందించారు. చాలా మంది రవాణా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఉన్నా అప్పుడున్న పరిస్థితుల్లో రవాణా కల్పించలేని పరిస్థితి.


అయినా అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల నేడు భారత్ కోలుకొని మళ్ళీ గాడిన పడిన పడింది. ఆర్థికంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం చైనాలో కోట్లల్లో కేసులు వస్తున్నాయి. రోజు వేల మంది చనిపోతున్నారు. అయినా అక్కడి నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీలు దాని గురించి అస్సలు మాట్లాడడం లేదు. ఇక్కడ మాత్రం ఏదో జరిగిపోయిందని గొంతు చించుకొని  అరిచిన వాళ్ళు ప్రస్తుతం చైనాలో పరిస్థితిని చూసి వారిని ఎందుకు విమర్శించడం లేదో వారికే తెలియాలి. ఏదేమైనా చైనాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: