దాదాపు ఏడాది కాలంగా ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. అగ్రరాజ్యం అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రెజిల్.. తోసహా చాలా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇటివల కాస్త పరిస్థితులు చక్కబడి వ్యవస్థలు తిరిగి గాడిలో పడుతున్నాయి. అయితే.. కరోనా కేసులు తగ్గాయేమో కానీ.. తీవ్రత కాదు అనే మాటను నిజం చేస్తూ మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఫ్రాన్స్, లండన్ లో లాక్ డౌన్ పెట్టారు. భారత్ లో కూడా కేరళ, ఢిల్లీ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకింత కలవరపాటు తప్పడం లేదు. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది.



అత్యంత జాగ్రత్తలతో దేశంలో సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. కొందరు విదేశాల్లో కూడా షూటింగ్స్ జరుపుతున్నారు. వీటిలో ప్రభాస్ రాధే శ్యామ్ ఉంది. ఔట్ డోర్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. నాగార్జున మనాలిలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ మెట్రోలో ప్రయాణించి మియాపూర్ లో షూటింగ్ కు హాజరయ్యారు. సీనియర్ స్టార్ హీరోలు త్వరలో షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ అనే మాట సహజంగానే కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతానికి కేంద్రం నుంచి కూడా అలెర్ట్ చేసే న్యూస్ లేదు కానీ.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది.


కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చిన పర్మిషన్ తో ధియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి. సింగిల్ ధియేటర్లు ఇంకా తెరుచుకోకపోయినా.. మల్టీప్లెక్సులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి కొత్త సినిమాలు రిలీజ్ కాకపోయినా.. ప్రేక్షకులు అలవాటు పడేందుకు కొన్ని సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. విజయవాడలో ఓ కొరియన్ సినిమా హౌస్ ఫుల్ కావడం విశేషం. పరిస్థితులు చక్కబడుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో.. సెకండ్ వేవ్ కలవరపాటుకు గురి చేసేదే. మరి.. ఏం జరగబోతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: