కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నో గాట్స్ నో గ్లోరీ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

తెలుగు లో ఈ మూవీ ని తెగింపు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేయడం మాత్రమే కాకుండా ... ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ ట్రైలర్ కు మరియు తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది  సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై అజిత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే జనవరి 11 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: