ఒకే ఒక జీవితం సినిమాతో చాలా ప్లాప్ లా తర్వాత ఒక మంచి హిట్ కొట్టిన శర్వానంద్ తన తర్వాత సినిమా గా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

దీనికి శర్వా 35 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చూడడాని కి చాలా ఫ్రెష్ గా ఉంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వరసగా సక్సెస్ లు కొట్టిన డైరెక్టర్లు అందరూ కూడా శర్వా దగ్గరి కి వచ్చే సరికి మాత్రం హిట్ ఇవ్వలేక చేతులు ఎత్తేస్తున్నరు.

ఆర్ ఎక్స్ 100 సినిమా తో మంచి హిట్ అందుకున్న అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమా తో శర్వా కి భారీ ప్లాప్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత హను రాఘవపూడి లాంటి మంచి డైరెక్టర్ కూడా పడి పడి లేచిన మనసు సినిమా తో ప్లాప్ ఇచ్చాడు.కిషోర్ తిరుమల లాంటి మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేసినప్పటి కీ అది పెద్దగా ఆడలేదు...ఇక చివరి కి ఒకే ఒక జీవితం తో మంచి హిట్ అందుకున్న శర్వా ఇప్పుడు ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అందుకే స్టోరీ లా విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది... ఇక ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ బాగా నచ్చడం తో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనా లే పెట్టుకుంటున్నాడు. ఈ సినిమా కనక బాగా ఆడితే శర్వా కి మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి హిట్ కొట్టి ఆ మార్కెట్ ని పెంచుకుంటాడో లేదో తెలియాలంటే ఇంకోన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: