మన సమాజంలో చాలామంది మహిళలు సపోర్టు లేక, సరైన అండదండా లేక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. కుటుంబ సభ్యుల వెన్నుదన్ను లేకపోవడంతో వీరు పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది. అలా చిన్నతనంలోనే తల్లినీ, టీనేజ్ లో పెంచిన అమ్మమ్మను కోల్పోయి ఎన్నో కష్టాలను అనుభవించింది ఓ అమ్మాయి. ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన తనకు ఎంతో
మధుర జ్ఞాపకమని చెబుతోంది. మరి ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగేళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో చెల్లిని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దుజోమ్. అక్కా చెల్లెలు టీనేజ్లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్న కన్నతల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియట్ కోసం ఇటానగర్ వెళ్ళిపోయింది అదే ఆమె జీవితానికి మలుపు అయింది. ఇప్పుడు ఆమె పికిల్ క్వీన్, పచ్చళ్ళ సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారిలోకి రానివ్వరు కానీ డుజొం స్వయంసమృద్ధి కోసం నిరుపేద గృహిణులకు పచ్చళ్ళ మేకింగ్ లో మార్కెటింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తోంది.
తన ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే అమ్మమ్మ చనిపోవడంతో ఆమె చెల్లెలు, ఆమె ఇద్దరు మళ్లీ
తండ్రి చెంతనే చేరవలసి వచ్చింది.
తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో ఇంకో అమ్మ కూడా ఉంది. ఆమె ఎంత కష్ట పెట్టిందో గుర్తు చేసుకుంటూ ఉంది. పచ్చళ్ళ సామ్రాజ్యానికి మహారాణి అరుణాచలం పికిల్
హౌస్ కి ఇప్పుడు ఆ రాష్ట్ర
రాజధాని ఇటానగర్ లో పెద్ద పేరు. తన పిన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన పన్నెండేళ్ల వయసులో నెలకు ఇంత డబ్బు దాచి పెట్టు కొని ఫుడ్ ప్రాసెసింగ్ లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మహిళలు నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్ ప్రదేశ్ తిరిగి వచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతిలో శాస్త్రీయంగా శిక్షణ పొంది ఆ క్రమంలో పికిల్
హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు ఆమెకు.