ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ కి ఏమైందో అర్థం కావడం లేదు . పర్ఫెక్ట్ కటౌట్ ఉండే హీరో మెటీరియల్ రోల్స్ వస్తున్న సరే అది రిజెక్ట్ చేసి విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చూసి చూసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించి అభిమానులను ఎలా షాకింగ్ గురి చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం అలాంటి పనే చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది .


ఈ సినిమాలో హృతిక్ రోషన్ అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.  యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ద్రిల్లర్ వార్ 2 వీడియో తాజాగా రిలీజ్ అయి అభిమానులని ఆకట్టుకునింది . ఇందులో హృతిక్ రోషన్ అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ హైలెట్ అవ్వబోతుంది అంటూ ఆ చిన్న వీడియోతో తెలిసిపోయింది . అయితే ఈ సినిమాలో విలన్ షేడ్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది . సినిమా నుంచి రిలీజ్ అయిన ఏ అప్డేట్స్ చూసినా కూడా ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. అయితే ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో నటించడం పట్ల పలువురు సినీ పెద్దలు కూడా ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టారు.



ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు . రిజల్ట్ ఏంటో కూడా తెలియలేదు . అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ మరో విలన్ షేడ్స్ క్యారెక్టర్ ఉన్న సినిమాకు సైన్ చేశాడు అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారట . దీని పట్ల అందరూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు . వార్ 2 సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి తదుపరి నిర్ణయం  తీసుకోవచ్చుగా అంటూ సజెస్ట్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ - సల్మాన్ ఖాన్ సినిమాలో నెగిటివ్ షేడ్శ్ లో కనిపించబోతున్నారు అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: