సమసమాజంలో ఉన్నదానితో బ్రతికేద్దాం అనుకునేవాళ్లు ఉంటారు, ధైర్యంగా ఒక అడుగు వేసి తాను ముందుకు పోతూ, పది మందిని తనతో తీసుకుపోయేవాళ్లు ఉంటారు. ఇక్కడ ఇద్దరి ఆలోచన వాళ్ళవాళ్ళ పరిస్థితిని బట్టి మంచిదే. కానీ వచ్చినది అందరికి సర్దుతూ, సర్దుబాటు బ్రతుకు బ్రతకడం ఒక కుటుంబానికైతే నప్పుతుంది కానీ ఒక వ్యవస్థకు తగినది కాదు. వ్యవస్థలో భిన్నవర్గాల ఉంటాయి. వాటి అన్నిటికి న్యాయం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దానికి తగిన విధానాలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఎప్పుడైతే తగిన విధానాలు అమలు చేయబడతాయో అప్పుడు సమాజంలో అందరికి అభివృద్ధి ఫలాలు దక్కుతాయి. దానికోసం ఆయా ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తుంది.

అప్పులు చేయడం కూడా దండుకునే వాళ్ళు ఉంటె నిర్వీర్యం అవుతుంది అనేది స్పష్టమైన నిజం. కానీ ఒక ఖచ్చితమైన నాయకత్వం దొరికినప్పుడు, అతడి నాయకత్వంలో ప్రతిదీ ప్రణాళికా బద్దంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పులు తెచ్చే విధానం కూడా సరైన రీతిలో అమలు చేయబడుతుంది. కేవలం అప్పులు తెచ్చేసి, వంటిని దొంగ లెక్కలు చూపించి మింగే నేతలు ఉంటె అది అప్పుచేసి పప్పుకూడు అన్నట్టే ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ సరైన నాయకత్వం లో ఈ విధానం అమలు చేయబడితే, ఆ సమాజం అభివృద్ధివైపు వడివడిగా అడుగులు వేస్తూ, భవిష్యత్తరాలకు మంచి జీవితాన్ని ఇస్తుంది. నాయకత్వాన్ని బట్టి ఆయా విధానాల అమలు ఉంటుంది. దాన్ని బట్టే ఫలితాలు కూడా ఉంటాయి.

అప్పులు ఆయా రాష్ట్రాలు చేస్తున్నాయి అంటే, అది దానికి తగ్గవిధంగా వినియోగించుకునే నాయకత్వం ఉన్నదనే భావించాల్సి వస్తుంది. ఎవరెవరో అప్పు ఇస్తున్నారు, మరెవరో కావాలని తెచ్చుకుంటున్నారు. తీరా చుస్తే అదంతా పౌరుల తలపై భారంగా మిగిలిపోతుంది. వాళ్ళ మిగిలిన జీవితాలను మసిబారిపోయేట్టుగా చేస్తుంది. సంక్షేమ పధకాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. పేదరికం ఉన్నంత కాలం వాటిని పక్కన పెట్టడం సాధ్యం అయ్యే పనికాదు. వాటిని అమలు చేస్తూనే, ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చితీరాలి. అప్పుడు అప్పు అనేది భారంగా కాకుండా అభివృద్ధిలో భాగంగా అయిపోతుంది. ఎంతసేపు తెచ్చుకోవడమే కాకుండా తీరుస్తూ పోయే విధానం నాయకులను బట్టే ఉంటుంది. నేతలు ఉన్నారు నాయకులు లేరు అందుకే చైనా లాంటి దేశాలు ఆయా దేశాలను చక్కగా మింగేస్తున్నాయి. అమెరికా కు కూడా అప్పులు ఉన్నాయి, అక్కడ మంచి నాయకత్వం కూడా ఉంది. అందుకే అక్కడ ఆ విధానం అమలు సరిగ్గా ఉంది. అప్పు తప్పు కాదు, దానిని అమలు చేసే విధానం లో మార్పులు రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: