అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. రెండున్నర ఏళ్లలోనే అనూహ్యంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. ఏదో జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాల వల్ల కాస్త పరిస్తితి బాగున్నట్లే ఉంది గానీ...పూర్తి స్థాయిల్లో మాత్రం వైసీపీకి ప్రజలు అనుకూలంగా మాత్రం లేరు. గత ఎన్నికల్లో వచ్చిన ప్రజా మద్ధతు ఇప్పుడు లేదు. చాలావరకు నాయకులకు ప్రజా మద్ధతు తగ్గింది.  ఆ విషయం క్లియర్‌గా అర్ధమవుతుంది.

అయితే వైసీపీలో స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో వారి బలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు అందుబాటులో ఉండటం కావొచ్చు...వారి స్థానాల్లో టీడీపీ పికప్ అవ్వకపోవడం కావొచ్చు...కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బలంగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే వైసీపీలో ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే. టాప్‌లో రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు.

మంత్రులని పక్కనబెడితే...వైసీపీలో టాప్‌లో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డి, ప్రోద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి లు వైసీపీలో టాప్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఈ రెండున్నర ఏళ్లలో వీరిపై వ్యతిరేకత కూడా పెద్దగా రాలేదు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వీరి గెలుపుని ఆపడం కష్టమే. మళ్ళీ ఈ రెడ్డి ఎమ్మెల్యేలు సత్తా చాటేలా ఉన్నారు. వీరికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: