
ఇక యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళా ఓటర్లపైనే దృష్టి పెట్టింది. యోగీ సర్కార్లో మహిళలు, యువతులపై జరిగిన అత్యాచారాలు, దాడులపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. యోగీ ఆదిత్యానాథ్ హాయాంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.... మహిళల కోసం తాము చేయబోయే పథకాలు అంటూ ఓ ప్రత్యేక జాబితా విడుదల చేశారు కూడా. గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థినులకు ఓ స్కూటీ, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఓ లాప్ టాప్, పదో తరగతి పాసైన విద్యార్థినులకు ఓ స్మార్ట్ సెల్ ఫోన్ ఇస్తామని ప్రియాంక హామీలు ఇచ్చారు. అలాగే జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. అన్నట్లుగానే 120 మందితో ప్రకటించిన తొలి జాబితాలో 40 మంది మహిళలు, 40 మంది యువతకు అవకాశం కల్పించారు హస్తం పార్టీ అగ్రనేతలు. విపక్షాల ముప్పేట దాడితో ప్రస్తుతం బీజేపీ గెలుపు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.