
ఇక ఇలాంటి ఘటనలు తెరమీదికి వచ్చాక చూసిన నెటిజన్లు షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ లో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఆ షాక్ ఏంటి అనుకుంటున్నారా పైన ఫోటోలో కనిపిస్తున్నది ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా. అదేదో చిన్న పిల్లలు ఆడుకునే బాతు బొమ్మల కనిపిస్తుంది కదండీ అంతేనా.. మేం కరెక్ట్ గానే చెప్పాము కదాఅని అంటారా.. అలా అనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే అది మీరు అనుకున్నట్లుగా అది బొమ్మ కాదు.
ఇంతకీ అది ఏంటో తెలుసా కోడిగుడ్డు.. ఊరుకొండి బాసూ జోకులు వేయకండి కోడుగుడ్డు అంటే గుండ్రంగా ఉంటుంది. ఇలా బాతు ఆకారంలో ఎందుకు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి కోడిగుడ్డు ఉంటుందా అని అనుకుంటున్నారు కదా. ప్రపంచంలో కాదు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి బాతు ఆకారంలో ఉన్న కోడి గుడ్డు పెట్టింది కోడి. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో కోడి ఇలాంటి గుడ్డు పెట్టింది. దీంతో స్థానికంగా ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది స్థానికులు ఇది చూడటానికి వస్తున్నారు. అయితే కోళ్లు ఇలాంటి గుడ్డు పెట్టడం చాలా అరుదు అని పెంకు పూర్తిస్థాయిలో ఎదగక ముందే గుడ్డు పెడితే ఇక ఇలా జరుగుతుందని వెటర్నిటీ డాక్టర్లు చెబుతూ ఉండటం గమనార్హం..