2023 ఐపీఎల్ సీజన్లో వరుస మ్యాచ్ లలో విజయం సాధిస్తూ సత్తా చాటిన డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఇక ఇటీవల జరిగిన కీలకమైన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది అని చెప్పాలి. కీలక సమయంలో జట్టు నుంచి ఎలాంటి ప్రదర్శన అభిమానులు ఆశిస్తారో.. అలాంటి ప్రదర్శన చేశారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. అయితే బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేసే మెరుపు సెంచరీ చేశాడు.



 అయితే ఇక తమ ముందు గుజరాత్ జట్టు ఉంచిన భారీ టార్గెట్ ను చేదించలేకపోయిన ముంబై జట్టు.. ఎక్కువ పరుగులకే పరిమితమైంది. దీంతో భారీ తేడాతో విజయం సాధించిన గుజరాత్ జట్టు ఫైనల్ లోకి వెళ్లిన రెండో టీం గా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే మ్యాచ్లో బ్యాటింగ్లో చెలరేగి  పోయిన శుభమన్ గిల్ ను ఆపేందుకు ఎంతలా ప్రయత్నం చేసినా అటు ముంబై బౌలర్ల  వల్ల కాలేదు. కానీ గిల్ 30 పరుగుల వద్ద ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు బంగారం లాంటి ఛాన్స్ వదులుకుంది. అదే ఆ జట్టు ఓటమికి కారణమైంది.



 ఇటీవల గుజరాత్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి గిల్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ వదిలేసాడు. సాధారణంగా క్రికెట్లో క్యాచెస్ విన్స్ మ్యాచ్ అని చెబుతూ ఉంటారు. ఇటీవల రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా ఇది నిజమైంది. 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ వదిలేసాడు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిల్ చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక ఒక్క క్యాచ్ డ్రాప్ విలువ 99 పరుగులు అని చెప్పాలి. ఒకవేళ 30 పరుగుల వద్ద గిల్ ను అవుట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl