టీఎన్ఆర్ లాస్ట్ సెల్ఫీ వీడియో చూస్తే క‌న్నీళ్లే...​​​
హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ య్యూటూబ్ యాంక‌ర్,న‌టుడు,జ‌ర్న‌లిస్ట్ తుమ్మ‌ల న‌ర‌సింహారెడ్డి క‌రోనాతో మ‌ర‌ణించారు.అయితే టీఎన్ఆర్ చివ‌రిసారిగా త‌న అభిమానుల‌కు వీడియో సందేశం పంపిచారు.ఆ వీడియోలో త‌న అభిమానులు స‌న్నిహితుల యోగ‌క్షేమాల కోసం కొన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు. క‌రోనా విజృంబిస్తున్న నేప‌థ్యంలో తాను ఎక్క‌డికి వెళ్ల‌డంలేద‌ని ...మంచి పుస్త‌కాలు చ‌దువుతూ..మంచి సిన‌మాలు చూస్తూ ఇంట్లోనే ఉంటున్నాన‌ని టీఎన్ఆర్ తెలిపారు.ప్రాణాయామం,యోగా చేస్తూ త‌న పిల్ల‌ల‌తో గుడుపుత‌న్న‌ట్లు వీడియో ద్వారా సందేశాన్ని పంపారు.పిల్ల‌ల‌కు త‌మ ప‌నులు తామే చేసుకునేలా నేర్పించాల‌ని భ‌విష్య‌త్ లో వ‌చ్చే క‌ష్టాల‌ను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల‌ని తెలిపారు.ఇలాంటి స‌మ‌యంలో ఇంట్లో వాళ్ల‌తో గ‌డ‌పాల‌ని..క‌రోనా స‌మ‌యంలో ఇంటి పెద్ద‌లు భ‌యానికి గుర‌వ్వ‌డం ఎట్టి ప‌రిస్థితుల్లో మంచిది కాద‌న్నారు.భ‌యానికి గురికాకుండా...త‌గుజాగ్ర‌త్త‌లు తీసుకుంటే క‌రోనా మ‌న ద‌రిదాపుల‌కు కూడా రాద‌ని తెలిపారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రాణాయామం మంచిద‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రాణాయామం చేయాల‌ని స‌దేశాన్ని ఇచ్చారు.టీఎన్ఆర్ మ‌ర‌ణిచిన త‌రువాత ఆయ‌న పంపిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.కానీ త‌న అభిమానుల‌కు స‌న్నిహితుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పిన టీఎన్ఆర్ ఇలా క‌రోనా బారిన ప‌డి మృతి చెంద‌డం అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది


నటుడిగానూ టీఎన్‌ఆర్‌ మెప్పించారు. సుమంత్‌ హీరోగా,బోణి,చిత్రంలో కనిపించేది కొద్దిసేపే అయినా మంత్రి పాత్ర పోషించారు.నేనే రాజు నేనే మంత్రి, జార్జిరెడ్డి, సుబ్రహ్మణ్య పురం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, తదితర చిత్రాల్లో నటించారు.న‌టుడిగా ఒకవైపు చేస్తూనే దర్శకుడిగా తనదైన ముద్రవేయాలని టీఎన్‌ఆర్‌ ఆశ. అందుకు తగినట్లుగానే మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టీఎన్‌ఆర్‌ అంటుండేవారు. దర్శకత్వం చేసినా ఇంటర్వ్యూ చేయడం ఆపనని చెప్పేవారు. తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిదని, కొత్తవారికి ఎప్పుడూ అవకాశాలు లభిస్తాయని అనేవారు.

తుమ్మ‌ల న‌ర‌సింహారెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న అభిమానులు,స్నేహితులు క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు. య్యూటూబ్ ఇంట‌ర్వూల‌తో మంచి పేరు తెచ్చుకున్న టీఎన్ఆర్ సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అతిధులు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా ఆయ‌న ప్ర‌శ్న‌లు సంధించేవారు. టీఎన్ఆర్ మ‌ర‌ణం ఇటు సినిమా,మీడియా రంగానికి తీర‌నిలోట‌ని  పలువురు రాజ‌కీయ,సినీ,మీడియా ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: